'మెగా 157'లో నయనతార.. అమ్మడు ఆ రోల్ కు ఒప్పుకుంటుందా?

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ మరింత ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

 Chiranjeevi Director Mallidi Vassishta Mega157 Update, Mega157, Megastar Chiranj-TeluguStop.com

అయితే ఈయన ఇటీవలే రీమేక్ సినిమాలు చేయడంతో ప్లాప్స్ తో సఫర్ అవుతున్నాడు.వరుసగా రీమేక్ సినిమాలను ఎంచుకోవడం వల్ల తన లైఫ్ లో ఎప్పుడు లేని విధంగా ప్లాప్స్ అందుకుంటున్నాడు.

Telugu Chiranjeevi, Nayanthara, Uv-Movie

ఆచార్య, భోళా శంకర్( Bhola Shankar ) వంటి సినిమాలతో ప్లాప్స్ వచ్చాయి.భోళా ఇచ్చిన షాక్ తో స్ట్రైట్ సినిమాలనే చేయడానికి సిద్ధం అయ్యాడు.మరి చిరంజీవి ఇటీవల తన పుట్టిన రోజు నాడు రెండు కొత్త సినిమాలను ప్రకటించారు.అందులో మెగా 157 ఒకటి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్( UV Creations ) వారు భారీ స్థాయిలో నిర్మించనుండగా బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న విషయం విదితమే.

అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకోగా పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందట.

ఆ పాత్ర కోసం నయనతార( Nayanthara )ను అనుకుంటున్నారట.

Telugu Chiranjeevi, Nayanthara, Uv-Movie

ఇటీవలే ‘జవాన్'( Jawan ) సినిమా హిట్ తో అమ్మడికి బాలీవుడ్ అదిరిపోయే గ్రాండ్ వెల్కమ్ దక్కింది.దీంతో ఈమె పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈమెను తీసుకోవాలని అనుకుంటున్నారట.మరి నయనతార ఈ రోల్ కోసం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే ఎంత డిమాండ్ చేస్తుంది? అనేది చూడాలి.

బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ( Director Vassishta ) మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.నవంబర్ నుండి ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారని అప్పటి నుండి గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూట్ చేస్తారని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.చూడాలి చిరుతో ఎలాంటి సినిమా తీస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube