తాజాగా లక్నో- ముంబై ( LSG vs MI )మధ్య జరిగిన మ్యాచ్ ఇరుజట్లకు కీలకమే.ఈ మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో లక్నో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
ముంబై జట్టు కీలక మ్యాచ్లో ఓడి, ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలావరకు కోల్పోయింది.ఇదిలా ఉంటే ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్ కీలక పాత్ర పోషిస్తాడని అందరికీ తెలిసిందే.

బ్యాట్స్ మెన్ అవుట్ అయ్యాడు అనే సందర్భంలో ముందుగా వికెట్ కీపర్ అప్పీలు చేయాలి.బ్యాట్స్ మెన్ అవుట్ అనే చిన్న అనుమానం వచ్చినా కూడా వికెట్ కీపర్ లు గట్టిగా అరుస్తూ అప్పీలు చేస్తారు.ఇది ప్రతి మ్యాచ్లో సర్వసాధారణం.కానీ మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్( Ishan kishan ) కాస్త భిన్నంగా ప్రవర్తించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit sharma ) షాక్ అయ్యాడు.
బ్యాట్స్ మెన్ బ్యాట్ ను తగిలి వచ్చిన బంతిని క్యాచ్ పట్టుకుని, అవుట్ అంటూ అప్పీలు చేయకుండా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సైలెంట్ గా ఉండిపోయాడు.దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక రోహిత్ శర్మ షాక్ అయ్యాడు.

లక్నో ఇన్నింగ్స్ లో పవర్ ప్లే( Power play ) అనంతరం స్పిన్నర్ పీయూష్ చావ్లా బౌలింగ్ లో లక్నో ఓపెనర్ డికాక్ క్రీజు లో ఉన్నాడు.పీయుష్ చావ్లా వేసిన బంతికి డికాక్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి నేరుగా ఇషాన్ కిషన్ చేతిలో పడింది.క్యాచ్ అవుట్ అయినా కూడా ఇషాన్ కిషన్ అప్పీలు చేయలేదు.దీంతో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ వైపు చూస్తూ ఎందుకు ఆప్పీలు చేయడం లేదని ప్రశ్నించాడు.
అప్పుడు ఇషాన్ కిషన్ అప్పీలు చేయడం కంటే ముందే డికాక్ క్రీజు వదిలి వెళ్ళిపోవడం, అంపైర్ అవుట్ ప్రకటించడం జరిగిపోయింది.దీనిపై రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
ఈ కీలక మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమిని చవిచూసింది.