అషు రెడ్డిపై రోహిణి కామెంట్.. పండగ రోజే ఎమోషనలైన బ్యూటీ.. ఏం జరిగిందంటే?

బుల్లితెర ఆర్టిస్ట్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి మొత్తానికి తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.తన అందంతో మాత్రం కుర్రాళ్ళ మదిలో గుడి కట్టేసుకుంది.

 Rohinis Comment On Ashu Reddy The Beauty Was Emotional On The Festival Day What-TeluguStop.com

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ప్రస్తుతం బుల్లితెర పై ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.

పైగా వెండితెరపై కూడా బాగా బిజీ గా మారింది.కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టి లో పడిన ఈ ముద్దుగుమ్మ అచ్చం సమంత లాగా కనిపించడంతో జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుంది.

దాంతో వెండితెరపై నితిన్ నటించిన సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా అవకాశం అందుకుంది.ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని పెంచుకుంది.

అందులో తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.బిగ్ బాస్ షో తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా ఎంజాయ్ చేసింది.

అతడితో కలిసి పార్టీలు,పబ్ లు తిరుగుతూ అతడితో డేటింగ్ చేస్తున్నట్లు అందరి దృష్టిలో పడిపోయింది.కానీ ఆ తర్వాత ఆ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు.

ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే కామెడీ షో లో లేడీ కమెడియన్ గా చేసింది.అందులో మరో ఆర్టిస్ట్ హరి తో కలిసి బాగా రచ్చ చేసింది.

ఏకంగా అతడికి ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.దీంతో హరి తో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ అదంతా పుకారే అని కేవలం షో కోసం అలా చేశామని గతంలో చెప్పుకున్నారు.ఇక ఈమె కు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం గురించి మాటల్లో చెప్పలేము.

ఏకంగా ఆయన పేరును టాటూ వేయించుకుని మరీ తన అభిమానమేంటో నిరూపించింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా పంచుకుంటుంది.

యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక యాంకర్ రవి తో కూడా ఫన్నీ వీడియోలు చేస్తూ బాగా షేర్ చేసుకునేది.ఖాళీ సమయం దొరుకుతే సోషల్ మీడియాలో తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.

వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.

ఇక తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా పండగ సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

ఇక ఆ ఫోటోలను మరో ఆర్టిస్టు రోహిణి దింపింది.దీంతో ఆ ఫోటోలో అషు రెడ్డి బాగా అందంగా కనిపించింది.ఇక ఆ ఫోటోలను షేర్ చేయగా.వెంటనే రోహిణి.మనం ఫోటో తీస్తే ఇలా ఉంటది అని అనగా.థాంక్యూ సిచువేషన్ ఎలాంటిది అయినా, నా  తప్పు లేకున్నా నన్ను జడ్జ్  ఎప్పుడు చేయలేదు అంటూ  ఎమోషనల్ రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube