అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక బంజారాహిల్స్ లోని జీవీకే మాల్ ఎదురుగా, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ డివిజన్ విజయ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్లు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష చేపట్టారు .
ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి, విజయ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్మీ ఉద్యోగులను తగ్గించి యుద్ధం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు తగ్గించి.
వెంటనే అగ్ని పద్దు రద్దుచేసి, గతంలో ఉన్న ఆర్మీ ఉద్యోగుల పోస్టులను యధావిధిగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్.కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
.






