జోర్దార్ వార్తలు షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్ సుజాత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సుజాత నాగార్జునను బిట్టు అని పిలవడం ద్వారా విమర్శలను మూటగట్టుకున్నారు.
ఆ తర్వాత ప్రస్తుతం జబర్దస్త్ షోలో స్కిట్లు చేయడం ద్వారా జోర్దార్ సుజాత వార్తల్లో నిలుస్తున్నారు.
రాకింగ్ రాకేష్ టీమ్ లో రాకేష్, సుజాత కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అయితే మొదట్లో రాకేష్, సుజాత జోడీ రీల్ జోడీగానే మిగిలిపోతుందని చాలామంది ఫిక్స్ అయ్యారు.అయితే కొన్నిరోజుల క్రితం రాకేశ్, సుజాతల నిశ్చితార్థం జరగడంతో పాటు రాకేష్ ఇంట్లో సుజాత వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం హాట్ టాపిక్ అయింది.
అయితే రాకేష్ సుజాతల పెళ్లి 2023 ఫిబ్రవరిలో జరగబోతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.
మన ఊరి దేవుడు ఈవెంట్ లో గెటప్ శ్రీను రాకేశ్ సుజాతల పెళ్లి గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాకేష్ సుజాత తమ ప్రేమను గెలిపించుకున్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాకేశ్ సుజాత జోడీకి ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇమేజ్ ఉంది.రాకేశ్ సైతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే స్కిట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.
రాకేష్ సుజాత పెళ్లి చేసుకుని కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాకేష్ సుజాత జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.ఈ జోడీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాకేశ్ కు పలు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై రాకేశ్ సక్సెస్ సాధించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.