తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ జంట జోర్దార్ సుజాత ( Jordar sujatha )కమెడియన్ రాకింగ్ రాకేష్ ( Rocking rakesh )ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా వీరిద్దరూ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు.
అయితే జోర్దార్ సుజాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వకముందు న్యూస్ యాంకర్ గా పనిచేయడంతో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఇక రాకేష్ జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లను చేస్తూ కమిడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవలె రాకేష్, సుజాత ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షోలో వీరిద్దరూ కలసి భార్యాభర్తలుగా నటించడంతోపాటు ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకున్న విషయం తెలిసిందే.వారి పరిచయం కాస్త ప్రేమగా మారి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాకేష్ సుజాత ఇద్దరు కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు.అయితే రాకేష్ తరచూ ఈవెంట్లు చేయడం కోసం విదేశాన్ని తిరుగుతూ ఉంటారు.కానీ ఇప్పుడు తన భార్యతో కలిసి జంటగా వెళ్తున్నారు.
సతీమణికి తోడుగా కూడా వెళ్తున్నారు.వరంగల్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించింది.

గత పదేళ్లుగా లండన్( London )లో బోనాల జాతర( BONALA Jatara ) నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నిర్ణయించుకుంది.అందుకే యాంకర్, నటి, తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు.ఈ బోనాల జాతర వేడుకలు నిర్వహించడానికి భార్యతో కలిసి ఇటీవల రాకింగ్ రాకేష్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.అక్కడ దిగిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ఈ సందర్బంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.
కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు.చిన్నారుల చదువు, వైద్యానికి సహకరించారు.
ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ కోరగా.గతంలో వారు చేసిన సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం.
మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది.ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను అని చెప్పుకొచ్చారు రాకేష్.







