వీడు నా తమ్ముడు... అనసూయ మాటలకు ఎమోషనల్ అయిన రాకింగ్ రాకేష్!

జబర్దస్త్ ( Jabardasth ) తో ఫేమ్ తెచ్చుకున్న రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) హీరోగా, నిర్మాతగా KCR ( కేశవ చంద్ర రమావత్ ) అనే సినిమా తీసాడు.

నిజానికి ఈ సినిమా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే విడుదల కావాల్సి ఉండగా అప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది.

అప్పటినుంచి ఈ సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.ఇక ఈ సినిమాలో రాకేష్ హీరోగా నటించడమే కాకుండా ఆయనే నిర్మాతగా సినిమాని కూడా నిర్మించారు.

తాజాగా నేడు KCR సినిమా ట్రైలర్ లాంచ్  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ ( Anasuya ) పాల్గొని సందడి చేశారు.ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ.ఈ సినిమా గురించి వీడు తరచు నా వద్ద మాట్లాడుతూ.

Advertisement

ఈ సినిమా మనదక్కా, సినిమా నేను తీస్తున్నాను అని చెప్పాడు.నాకు ఇద్దరు చెల్లెల్లు కానీ వీడు నాకు తమ్ముడు.

అందరూ అతి వినయం అంటారు కానీ నిజంగానే వీడు అలాగే ఉంటాడు.నాకు వీడు హీరో అని చెప్పలేదు.16 సంవత్సరాల కుర్రాడి కథ అని మాత్రమే చెప్పాడు.

ఎవరైనా కొంత డబ్బు సంపాదించుకుంటే ఇల్లు కట్టుకోవడం లేదా స్థలం కొనడం చేస్తారు కానీ రాకేష్ మాత్రం సినిమా చేశాడు.సినిమా కోసమే ఇక్కడ నిలబడ్డారు.ఈ సినిమా కూడా బలగం సినిమా కంటే మంచి సక్సెస్ అవుతుందని అనసూయ వెల్లడించారు.

ఇలా ఈ వేడుకలో అనసూయ రాకేష్ ని ఉద్దేశించి తమ్ముడు అంటూ మాట్లాడటంతో పక్కనే ఉన్నటువంటి రాకేష్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?
Advertisement

తాజా వార్తలు