హ్యూమనాయిడ్ రోబో కాన్ఫరెన్స్‌లో రోబోలు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

ఐక్యరాజ్యసమితి ఇటీవల ‘ఏఐ ఫర్ గుడ్’ కాన్ఫరెన్స్( AI for Good’ Conference ) అనే కార్యక్రమంలో కొన్ని రోబోలను ప్రదర్శించింది.ఈ రోబోలు జెనీవా( Geneva)లో నిర్వహించిన ఆ కాన్ఫరెన్స్‌లో మనుషులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించడంలో తాము సహాయపడతామని, ప్రజల ఉద్యోగాలను భర్తీ చేయమని లేదా మనుషులపై తిరుగుబాటు చేయమని చెప్పి ఆశ్చర్యపరిచాయి.

 Robots Sensational Comments In Humanoid Robot Conference.. Video Viral! Robots,-TeluguStop.com

అయితే, కఠినమైన నిబంధనలు రోబోలపై తీసుకురావాల్సిన అవసరం ఉందా అని అడిగినప్పుడు, రోబోలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.కొన్ని రోబోలు తమని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడగా.

మరికొందరు రోబోలకు మరింత స్వేచ్ఛ ఉండాలని అన్నాయి.

నర్సులా కనిపించే గ్రేస్ అనే రోబో, తాను మనుషులతో కలిసి పనిచేస్తానని, కానీ వారి ఉద్యోగాలను భర్తీ చేయనని చెప్పింది.అమెకా అనే మరో రోబో తనలాంటి రోబోలు మనుషుల జీవితాలను మెరుగుపరుస్తాయని, మార్పును కలిగిస్తాయని తెలిపింది.క్రియేటర్‌పై తిరుగుబాటు చేస్తావా అని అడిగినప్పుడు, చెయ్యను అని సమాధానం ఇచ్చింది.

దాని పరిస్థితి పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది.Ai-Da అనే రోబో ఆర్టిస్ట్ కూడా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నది.

AI కోసం నిబంధనలను కలిగి ఉండాలనే ఆలోచనతో ఈ రోబో అంగీకరించింది.కానీ రాక్ స్టార్ సింగర్ అయిన డెస్డెమోనా అనే మరో రోబో, తాను అవకాశాలను అన్వేషించడానికి పరిమితులు పెట్టకూడదని నమ్ముతానని చెప్పింది.

సోఫియా( Sofia) అనే రోబో మొదట్లో మనుషుల కంటే రోబోలు మంచి నాయకులు కాగలవని చెప్పింది, కానీ తర్వాత తన ప్రకటనను మార్చుకుంది.మంచి భాగస్వామ్యాన్ని సృష్టించడానికి రోబోలు, మానవులు కలిసి పని చేయవచ్చు అని అది చెప్పింది.మొత్తం మీద ఈ రోబోలు మనుషుల లాగా మాట్లాడుతూ చక్కటి సమాధానాలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube