మొదటి రెండు మ్యాచ్ లను అజేయంగా గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మూడో మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది.తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమవడంతో ఐపిఎల్ 13వ సీజన్లో తొలి విజయాన్ని మూటగట్టుకుంది.అయితే ఈ మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప చేసిన పనికి ఇప్పుడు తన చుట్టూ ఓ వివాదాస్పదం మొదలైంది.అదేమిటంటే…
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాబిన్ ఊతప్ప బంతికి ఉమ్మి రాశాడు.ఇలా చేసే సమయంలో రాబిన్ ఊతప్ప కెమెరా కంటికి చిక్కారు.
కేకేఆర్ టీం ఓపెనర్ సునీల్ నారాయణ్ ఇచ్చిన అతి సులువైన క్యాచ్ ఇచ్చిన రాబిన్ ఊతప్ప దానిని వదిలేసాడు.ఆ తర్వాత కంగారులో రాబిన్ ఊతప్ప బంతికి లాలాజలం రుద్దేసాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య నేపథ్యంలో ఐపీఎల్ 13 వ సీజన్ ను బీసీసీఐ ఎంతో పకడ్బందీగా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లను నిర్వహిస్తుంది.
అయితే ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు కూడా ఐసీసీ కొన్ని నిబంధనలను విధించింది.అందులో మొదటి నిబంధనే బంతిపై ఎవరు కూడా ఉమ్మిని రాయకూడదని.
ఇకపోతే తాజాగా ఈ నిబంధనను రాబిన్ ఉతప్ప ఉల్లంఘించినట్లు అయింది.ప్రస్తుతం ఈ విషయం పై కొందరు క్రికెట్ పెద్దలు చర్చలకు దారి తీస్తున్నారు.అయితే ఎవరైనా మైదానంలో బాల్ కు ఉమ్మి రాసినట్లు కనబడితే ఆ బాల్ ను ఫీల్డ్ అంపేర్స్ ఆ బాల్ ను శానిటేషన్ చేసిన తర్వాత శుభ్రం చేసి బౌలర్ కు అందిస్తారు.అయితే ఇలా చేసిన వ్యక్తి కి మొదటి సారి అయితే ఫీల్డ్ అంపేర్స్ కు కొత్త రూల్స్ నిబంధనలను అతడికి వివరిస్తారు.
అదే రెండో సారి చేస్తే ఆ విషయంపై హెచ్చరిస్తారు.అదే తప్పు మూడోసారి గనక చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇచ్చేస్తారు.
అయితే ఈ విషయంలో రాబిన్ ఉతప్ప పై నెటిజన్లు మాత్రం కరోనా సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.