రజనీకాంత్ కుమార్తే ఐశ్వర్య ఇంట్లో పడ్డ దొంగలు... విలువైన ఆభరణాలు చోరీ!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి.కేవలం బుల్లితెర సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వెండితెర సెలబ్రిటీల ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడుతున్నారు.

 Robbery At Aishwarya Rajinikanth Home Stole Valuable Jewellery Details, Aishwary-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది.అసలేం జరిగిందంటే.

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు అయిన ఐశ్వర్య రజినీకాంత్( Aishwarya Rajinikanth) కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ జంట విడిపోయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఐశ్వర్య ఇంట్లో లాకర్ లో ఉన్న వజ్రాలు, అరమ్ నెక్లెస్ తో పాటు 60 సవరీల గాజులు కనిపించకుండా పోయాయని చెన్నై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్య ఫిర్యాదు చేసింది.అయితే వాటి విలువ లక్షల్లో ఉంటుందని తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని ఆమె ఫిర్యాదులో తెలిపింది.2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ఆ నగలను ఉపయోగించిన తర్వాత వాటిని తన లాకర్‌లో ఉంచినట్లు తెలిపింది.2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సేయింట్ మేరీస్ రోడ్డు లోని తన అపార్ట్ మెంట్ లో ఉంచానని, హీరో ధనుష్ (Danush)తో కలిసి ఉన్న సమయంలో వాటిని అక్కడికి మార్చినట్లు ఆమె వెల్లడించింది.

తర్వాత 2022 లో తన తండ్రి రజినీకాంత్ పోయిస్ గార్డెన్ ఇంటికి షిఫ్ట్ చేసినట్లు ఆమె తెలిపింది.ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు అపార్ట్ మెంట్ లోని ఉంటాయని, వాటి గురించి తన ఇంట్లో పనిచేసే ముగ్గురికి తెలుసునని, తన నగలు, వజ్రాలు, బంగారు గాజులు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది ఐశ్వర్య.ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.అలాగే ఆమె ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురిని విచారిస్తున్నారు.ప్రస్తుతం ఆమె దర్శకురాలిగా నిర్మాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube