మేడ్చల్( Medchal ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దుండిగల్ ఓఆర్ఆర్ ( DUNDIGAL ORR )సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతుడు టెక్ మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు.