విశాఖ జిల్లా పెందుర్తి( Pendurthi )లోని అక్కిరెడ్డిపాలెం( Akkireddypalem )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.టాటా ఏస్ ను లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాసులుగా గుర్తించారు.