మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.చిరంజీవి తలచుకుంటే లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయగలరు.
అయితే మెగాస్టార్ మాత్రం వీలైనంత సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు.చిరంజీవి గతంలో చేసిన ఒక పని నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
ఒక ఈవెంట్ లో భాగంగా ఒక చిన్నారి రామ్ చరణ్ ( Ram Charan )తో ఫోటో దిగాలని భావిస్తే చిరంజీవి స్వయంగా ఆ ఫోటోలను క్లిక్ చేశారు.ఇండస్ట్రీలో ఇంత మంచితనంతో ఉండే గొప్ప హీరోలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.
మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర( visvambara ) షూటింగ్ లో పాల్గొంటుండగా లక్ష బీర్ బాటిల్స్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.విశ్వంభర సినిమాలో ఫైట్స్ కూడా కొత్తగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో ఫ్యాన్స్ మరిన్ని సినిమాలను కోరుకుంటున్నారు.
ఈ కాంబినేషన్ లో ఊరమాస్ సినిమాను ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ తరహా సినిమాలకు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే.విశ్వంభర సినిమా సైతం ఆడియన్స్ ను అంచనాలకు మించి ఆకట్టుకోవడంతో పాటు చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా చేరుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మల్లిడి వశిష్ట( Mallidi Vasishta ) రెండో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.