RK Naidu The 100 Movie : విడుదలకు సిద్దంగా ఆర్కే నాయుడు ”ద 100” చిత్రం !!!

ఆర్కే నాయుడుగా( RK Naidu ) బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.( Sagar ) ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

 Rk Naidu The 100 Movie : విడుదలకు సిద్దంగా ఆ-TeluguStop.com

ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్.”ద 100”( The 100 Movie ) అనే వైవిధ్యమైన టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు.

గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కు చాల అంతర్జాతీయ అవార్డ్స్ రావడం జరిగింది.ద 100 సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

Telugu Raghavomkar, Rk Sagar, Sagar, Rk, Tollywood-Movie

ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపిఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ నటిస్తున్నాడు.’ద 100′ చిత్రంలో తన పాత్ర కోసం ఆర్కే సాగర్ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మంచి యాక్షన్ తో విక్రాంత్ ఐపిఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.

Telugu Raghavomkar, Rk Sagar, Sagar, Rk, Tollywood-Movie

అర్జున్ రెడ్డి కి, బాలీవుడ్ చిత్రం యనిమల్ కి సంగీతం సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం.త్వరలో ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చెయ్య బోతున్నారు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ద 100 సినిమాని ఏప్రిల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ అందరూ చూడదగ్గ సినిమాగా ఈ మూవీని తీర్చిదిద్దడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube