ఒకప్పుడు తిండికి కూడా లేదు.. ఇప్పుడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి..!

సీఓజీఈఎఫ్ (COGEF) అధిపతి, దిగ్గజ వ్యాపారవేత్త రిజ్వాన్ అదాటియా( Rizwan Adatia ) తన అద్భుతమైన జీవితంతో అందరినీ ఇన్‌స్పైర్‌ చేస్తున్నారు.గుజరాత్‌ రాష్ట్రం పోర్‌బందర్‌లో పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ, రిజ్వాన్ తన తల్లిదండ్రుల నుంచి కృషి, నిజాయితీ, చిత్తశుద్ధి, విశ్వాసం వంటి విలువలను నేర్చుకున్నారు.

 Rizwan Adatia African Businessman Success Story , Nri News, Rizwan Adatia, Coge-TeluguStop.com

తమ పెద్ద కుటుంబాన్ని పోషించడానికి వేరుశెనగ విక్రేతగా తన తండ్రి పడిన కష్టాన్ని అతడు కళ్లారా చూశారు.తన తండ్రి నుంచే అతను ప్రేరణ పొంది జీవితంలో ఎదగాలని నిశ్చయించుకున్నారు.

తన తెలివైన సోదరుడు ఆషిక్ భాయ్ మద్దతుతో, రిజ్వాన్ స్వశక్తితో వ్యాపార యజమానిగా మారాలని ఆకాంక్షించారు.చదువుకుంటున్న రోజుల్లోనే స్థానిక కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు.

అలా వ్యాపారంలో విలువైన అనుభవాన్ని పొందారు.చివరికి, వ్యాపారం గురించి మరింత తెలుసుకోవడానికి ఆఫ్రికా( Africa )కు వెళ్లమని అతని సోదరుడు అతన్ని ప్రోత్సహించారు.

Telugu Africa, Chairman, Cogef, Empathy, Gujarati Origin, Nri, Porbandar, Raf, R

1986, ఆగస్టులో రిజ్వాన్ తన కలల సాధనలో భాగంగా ఆఫ్రికాలోని కిన్షాసాకు విమానంలో బయలుదేరారు.పాజిటివ్ ఆటిట్యూడ్, సమస్య-పరిష్కార మనస్తత్వంతో, అతను వివిధ అడ్డంకులను అధిగమించారు.తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విలువలతో ఆఫ్రికాలో గొప్ప వ్యాపారవేత్తగా అనతి కాలంలోనే అవతరించారు.తన కరుణ, సానుభూతి లక్షణాల కారణంగా రిజ్వాన్ NGO, RAF గ్లోబల్‌లను లక్షల మంది ప్రజల జీవితాలను బాగు చేయడానికి స్థాపించారు.

Telugu Africa, Chairman, Cogef, Empathy, Gujarati Origin, Nri, Porbandar, Raf, R

ఇక COGEF గ్రూప్ ఛైర్మన్‌గా రిజ్వాన్ ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో( African businessman) అనేక సూపర్ మార్కెట్లు, దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు నెలకొల్పారు.వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నారు.2030 నాటికి తన NGO ద్వారా 10 మిలియన్ల మందికి సహాయం చేయడమే ఆయన లక్ష్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube