భారతీయ మహిళా రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకోవడంతో యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురి అయ్యింది.రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ఈ విషాదకరమైన వార్తను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
దీంతో క్రీడా అభిమానులు తీవ్ర నిరాశతో మునిగితేలుతున్నారు.కొన్నేళ్ళ క్రితం ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన “దంగల్” బయోపిక్ ద్వారా మహిళా కుస్తీ పోటీ దారులైన గీతా, భవిత జీవిత చరిత్రల గురించి మనందరం తెలుసుకున్నాం.
అయితే గీతా, భవితలకు ఒక కజిన్ సిస్టర్ ఉన్నారు.ఆమె పేరు రితికా ఫోగాట్ కాగా.ఆమె కూడా కుస్తీ పోటీలలో ఆడుతుంటారు.ఇటీవల ఆమె రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ సిటీ లోహ్‌ఘర్ స్టేడియంలో మార్చి 12 నుంచి 14వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఉమెన్, మెన్ రెజ్లింగ్ టోర్నమెంట్ లో పోటీ చేశారు.
అయితే ఆమె సెమీ ఫైనల్ వరకు అన్ని మ్యాచుల్లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఫైనల్ కి చేరుకున్నారు.ఫైనల్ మ్యాచ్ మార్చి 14వ తేదీన జరిగింది.ఈ మ్యాచ్ లో ఆమె 1 పాయింట్ తేడాతో ఓడిపోయారు.ఐతే ఆమె ఆ పరాభవాన్ని భరించలేక తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
మనస్థాపంతోనే మార్చి 15 అనగా సోమవారం రోజు ఆమె తన సొంత గ్రామమైన బాలాలి లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రితికా ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగాట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు.రాజస్థాన్‌లోని జైత్‌పూర్ గ్రామం నివాసి అయిన రితికా.హర్యానాలోని మహావీర్ ఫోగట్ స్పోర్ట్స్ అకాడమీలో 5 ఏళ్లుగా కుస్తీ ఆట నేర్చుకున్నారు.
కోచ్ మహావీర్ సింగ్ ఈ టోర్నమెంట్‌కు హాజరైనట్లు కూడా తెలుస్తోంది.ఓడిపోయిన తర్వాత ఆమెను ఓదార్చిన్నట్లు కూడా సమాచారం.
కానీ ఓటమిని తట్టుకోలేని ఆమె మాత్రం పెద్ద నిర్ణయం తీసుకొని తన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.
రితికా మృతిపై దర్యాప్తు ప్రారంభించినట్లు హర్యానా పోలీసులు తెలిపారు.
ఆమె భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.మార్చి 16వ తేదీన కుటుంబ సభ్యులు రితికా ఫోగాట్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఏది ఏమైనా కేవలం ఒక్క పాయింట్ తో ఓడిపోయినందుకు చనిపోవాలనే పెద్ద నిర్ణయం తీసుకోవడం విచారకరం.ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే కావడం తల్లిదండ్రులను మరింత కలిచివేస్తోంది.
రాష్ట్రస్థాయి పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమీ కాదని అసలు రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తమకు అర్థం కావడం లేదని ఆమె సోదరుడు హర్వింద్ర చెప్పుకొచ్చాడు.