Rithu Chowdary: బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టిన రీతూ చౌదరి.. ఆ ఫోటోతో నోరు మూయించిందిగా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి( Rithu Chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

 Rithu Chowdary Shares A Photo With Srikanth And Gave Clarity-TeluguStop.com

అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లి చూపులు ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చింది.స్టార్ మాలో ప్రసారం అయినా గోరింటాకు సీరియల్ ద్వారా తన నటనను మొదలుపెట్టింది రీతు చౌదరి.

ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

ఈ క్రమంలో అడపాదడపా సినిమాలలో సైతం మెరిసింది.ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటీని సంపాదించుకుంది.అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.కాగా జబర్దస్త్, సీరియల్స్ ద్వారా కంటే రీతు చౌదరి సోషల్ మీడియాలోనే బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పవచ్చు.

రీతు చౌదరికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.తరచూ సోషల్ మీడియా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.

కాగా ఆ మధ్య ఒకసారి ఈమె శ్రీకాంత్‌( Srikanth ) అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రాసుకొచ్చిన క్రమంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని కన్ఫామ్‌ అయిపోయింది.రీతూ నుదుటన శ్రీకాంత్‌ ముద్దు పెట్టిన వీడియో కూడా వైరల్‌ అవడంతో పాటు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఫోటో కూడా బయటకు వచ్చింది.ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించనేలేదు.రీతూ శ్రీకాంత్ తో కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్‌ చేయడంతో వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా గత కొద్ది రోజులుగా రీతూ బ్రేకప్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తుండడంతో తాజాగా ఆ వార్తలకు చెప్పి పెట్టింది రీతూ.ఆమె ఒక ఫొటో షేర్ చేసి షాక్ ఇచ్చింది.

అందులో ఆమె శ్రీకాంత్ తో కలిసి కనిపిస్తోంది.ఆ ఫోటోతో బ్రేకప్ వార్తలకు ఒకసారిగా చెక్ పెట్టేసింది రీతూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube