ప్రముఖ నటి రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటిగా, క్రీడాకారిణిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రితికా సింగ్ ఇరుది సుట్రు, గురు, సాలా ఖడూస్, శివలింగ,( Shivalinga ) నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాలలో నటించారు.
స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా రితికా సింగ్ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.మహారాష్ట్ర రాష్ట్రంలో పుట్టిన రితికా సింగ్ చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు.
సోషల్ మీడియాలో సైతం రితికా సింగ్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.మహిళలపై జరిగే దారుణాల గురించి రితికా సింగ్ తరచూ స్పందిస్తూ ఉంటారు.మహిళలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలా సందర్భాల్లో రితికా సింగ్ వెల్లడించారు.మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి రితికా సింగ్ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లు సైతం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
రితికా సింగ్( Rithika singh ) ఆ పోస్ట్ లో ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఒక మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.ఈ తరహా ఘటనలు చూసిన ప్రతి సందర్భంలో నా రక్తం మరిగిపోతుందని రితికా సింగ్ కామెంట్లు చేశారు.
ఈ దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు.
ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలబడాలంటే మన పిల్లలతో చర్చించాలని ఆమె కామెంట్లు చేశారు.భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె చెప్పుకొచ్చారు.మహిళలు ఇలాంటి దారుణాలపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలని రితికా సింగ్ ( Rithika singh )కామెంట్లు చేశారు.
రితికా సింగ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.