రిషబ్ శెట్టి.( Rishab Shetty ) కాంతార( Kantara ) సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ఈ సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్నది కూడా చాలామందికి తెలియదు.కానీ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి.
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
కాగా కన్నడ లో మొదట విడుదల చేయగా ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో అన్ని భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కాగా కాంతార 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కన్నడ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే హీరో రిషబ్ శెట్టి కి కాంతార సినిమా తరువాత భక్తి మరింత పెరిగింది.
రిషబ్ శెట్టి కి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువే.అందుకు తగ్గట్టుగానే ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు.
కాగా రిషిబ్ శెట్టికి కాంతార తరువాత భక్తి మరింత పెరిగింది.తాజాగా దక్షిణ కన్నడ జిల్లా కడబా తాలూకాలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని( Kukke Subrahmanya Temple ) సందర్శించారు రిషబ్ శెట్టి ఆయన కుటుంబ సభ్యులు.అనంతరం ధర్మస్థలానికి వెళ్లి పూజారి వీరేంద్ర హెగ్గడే అని కలుసుకొని ఆసిస్సులను అందుకున్నారు.ఈ సందర్భంగా వీరేంద్ర రిషబ్ శెట్టి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.రిషబ్ సెట్టి తో పాటు ఆయన భార్య ప్రగతి పిల్లలు కూడా ఆ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.