కన్నడ సినిమా కాంతర గురించి ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వింటున్నాం.రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా లో క్లైమాక్స్ గురించి కథ గురించి నటీ నటుల గురించి ఇలా ప్రతి విషయం గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతర సినిమా కర్ణాటకలో విపరీతమైన వసూళ్లను నమోదు చేస్తున్న విషయం తెల్సిందే.ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా గురించిన విషయాలు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.కాంతర సినిమా చాలా విభిన్నంగా ఉందని.
తెలుగు వారికి కూడా నచ్చే విధంగా ఉంటుంది అంటూ డబ్బింగ్ చేశారు.ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.
తాజాగా విడుదల అయిన ట్రైలర్ గురించి తెలుగు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.
ఈ సినిమా తెలుగు వారికి ఎంత వరకు రీచ్ అవుతుంది అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మధ్య కాలంలో కన్నడం నుండి వచ్చిన కేజీఎఫ్ రెండు పార్ట్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అందుకే తెలుగు లో కాంతర సినిమా కూడా మంచి వసూళ్లను నమోదు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా కూడా కాంతార సినిమా గురించిన చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార సినిమా కనీసం పది కోట్లు రాబట్టినా కూడా అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు.ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి అయ్యాయి.నాచురాలిటీని మిస్ చేయకుండా సినిమా ను డబ్ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.మరి ఈ సినిమా తెలుగు లో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.