సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.సమంత పెళ్ళికి ముందు ఎలా వరుస సినిమాలు చేసిందో ఇప్పుడు విడాకుల తర్వాత అదే జోరు కొనసాగిస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు కంటే డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించు కోకుండా దూసుకు పోతుంది.అయితే ఈమె మొదటి సినిమా ఏమాయ చేసావే లో మెయిన్ హైలెట్ అయ్యింది ఈమె వాయిస్ అనే చెప్పాలి.
హస్కీ వాయిస్ తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది.మరి ఈమెకు వాయిస్ అందించింది చిన్మయి అనే విషయం అందరికి తెలుసు.
ఆ తర్వాత సినిమాలకు కూడా చిన్మయి నే సమంత కు వాయిస్ అందిస్తూ వస్తుంది.
అయితే సామ్ మహానటి సినిమా నుండి తన ఓన్ వాయిస్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.కానీ ఈమె పూర్తి స్థాయిలో మాత్రం ప్రేక్షకులను తన వాయిస్ తో మేపించలేక పోతుంది.మరి ఈమెకు చిన్మయికి దూరం పెరగడానికి కారణం ఏంటా అని అంతా ఎంత చర్చించుకున్న ఎవ్వరికి అర్ధం కాలేదు.
ఇక ఇప్పుడు యశోద సినిమా విషయంలో కూడా సామ్ తన సొంత స్వరాన్ని వినిపించాలని అనుకుంటుందట.
కానీ మేకర్స్ మాత్రం చిన్మయితో డబ్బింగ్ చెప్పిద్దాం అని అంటున్నారట.
ఆ కారణంగానే సమంత యశోద సినిమా డిలే అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవలే ఈమె హెల్త్ సమస్యల కారణంగా యుఎస్ వెళ్లి తిరిగి వచ్చింది.
వచ్చిరాగానే యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతానని చెప్పిందట.కానీ మేకర్స్ మాత్రం చిన్మయి అయితే బాగుంటుంది అని చెబుతున్న.
ఈమె మాత్రం థానే డబ్బింగ్ చెప్పుకుంటానని పట్టు బడుతుంది అని తెలుస్తుంది.మరి ఈమె ఓవర్ కాన్ఫిడెంట్ నే సినిమాకు మైనస్ అవుతుందేమో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.ఇక నెటిజెన్స్ సైతం సమంత పై ఫైర్ అవుతున్నారు.అసలు సామ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యిందే తన హస్కీ వాయిస్ వల్ల.మరి అలాంటి వాయిస్ ను వద్దు అని ఈమె సొంత గాత్రం అందించడానికి రెడీ అవ్వడం ఎంత వరకు కరెక్ట్ నో ఈమెకే తెలియాలి.