ఇళ్లల్లో లేదా ఆఫీసులలో చోరీలు జరుగుతాయని అందరికీ తెలిసిందే.ఎక్కడ చోరీలు జరిగిన పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్లు దర్యాప్తు చేసి పరిష్కారం చూపిస్తారు.
అదే పోలీస్ స్టేషన్లో చోరీ జరిగిందంటే వినడానికే ఆశ్చర్యం.
ఒక పోలీస్ స్టేషన్లో( Police station ) దొంగలు పడి నానా బీభత్సం చేసి, అక్కడ ఉండే సీసీ కెమెరాలను( CCTV Cameras ) సైతం ధ్వంసం చేసి పరారయ్యారు.
వివరాలలోకి వెళితే బీహార్ లోని( Bihar ) ఛప్రా పరిధిలోని సిటీ పోలీస్ స్టేషన్ క్యాంపస్ లో కొందరు దుండగులు, హోంగార్డు జవాన్ రైఫిల్ చోరీ చేసి పరారయ్యారు.ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్లో పోలీసులకే భద్రత లేనప్పుడు ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు.

హోంగార్డ్ జవాన్లు రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ సంఘటన జరిగింది.ఉదయం ఈ విషయం కాస్త జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసుల రైఫిలను తనిఖీ చేయగా, హోంగార్డ్ జవాన్ యొక్క రైఫిల్ దొంగతనం( Rifle Theft ) చేసి సీసీటీవీలను ద్వంసం చేసినట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

ఫింగర్ ప్రింట్స్, ఇతర వస్తువుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, దుండగులు ఎక్కువగా ప్రాంతాలలో ప్రత్యేక దిగను ఏర్పాటు చేశారు.నగరంలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్ లను ముమ్మరంగా తనిఖీ చేసినా కూడా ఇంతవరకు ఎటువంటి క్లూ మాత్రం లభించలేదు.
కొంతమంది దుండగులు పోలీస్ స్టేషన్ పై కన్నేసి ఎవరూ లేకుండా కేవలం ఒక జవాన్ మాత్రమే ఉన్న సమయంలో పక్కా పథకం ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పోలీస్ స్టేషన్లో మిగతా వస్తువులు ఏవైనా పోయావా అనే దాని గురించి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.







