శ్రీకాంత్ చేతుల మీదుగా విడుద‌లైన ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్

సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ .

ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌.

సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు.ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించాయి.

సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను సీనియ‌ర్ హీరో, విల‌క్ష‌ణ న‌టుడు శ్రీకాంత్ విడుద‌ల చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో హీరో ర‌మ‌ణ్‌తో పాటు ర‌ద్శ‌కులు ర‌మేష్‌, గోపి పాల్గొన్నారు.

Advertisement

ఈ సంద‌ర్భంగా.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘దర్శకులు రమేష్, గోపిలతో మంచి అనుబంధం ఉంది.

వారి కాంబోలో రూపొందిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది.ఏప్రిల్ 8న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను.

అలాగే ఈ సినిమాతో హీరోగా, నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్న ర‌మ‌ణ్‌కు సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి.త‌ను మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అని తెలిపారు.

హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారంటే ఎంతో అభిమానం నేను హీరోగా చేసిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైల‌ర్ ఆయ‌న చేతుల మీదుగా విడుద‌ల‌వ‌డం అనేది ఎంతో హ్యాపీగా ఉంది.ద‌ర్శ‌కులు ర‌మేష్‌, గోపి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ను అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తెర‌కెక్కించారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.చిత్ర ద‌ర్శ‌కులు ర‌మేష్, గోపి మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి శ్రీకాంత్‌గారితో మంచి రిలేష‌న్ ఉంది.

Advertisement

ఆయన మా సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసినందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌.ఏప్రిల్ 8న సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

తాజా వార్తలు