బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అతని ప్రియురాలు రియా చక్రవర్తి మెడకి చుట్టుకునేలా కనిపిస్తుంది.సుశాంత్ తండ్రి కీలక ఆధారాలతో రియాపై బీహార్ పాట్నాలో కేసు పెట్టాడు.
సుశాంత్ నుంచి 15 కోట్లు రూపాయిలు రియా కాజేసిందని, అతనికి అవకాశాలు రాకుండా చేసిందని, అతనిని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా ఒత్తిడికి గురయ్యేలా చేసి అతని చావుకి కారణం అయ్యిందని సుశాంత్ కుటుంబం చేస్తున్న ప్రధాన ఆరోపణ.అయితే వారి ఆరోపణలపై రియా చక్రవర్తి సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.
ఆమె వ్యవహార శైలి కూడా అందుకు తగ్గట్లే ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.సుశాంత్ తండ్రి పెట్టిన కేసు ప్రకారం పాట్నా పోలీసులు ముంబైలో ఉంటున్న రియా చక్రవర్తిని విచారించడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.
ఇప్పటికే సుశాంత్ కేసుపై ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు పాట్నా పోలీసులు కూడా ఈ కేసు మీద విచారణ మొదలు పెట్టడంతో ఆమె తన లాయర్ ద్వారా సుప్రీం కోర్టుని ఆశ్రయించి బీహార్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణని ముంబై పోలీసులకు అప్పగించాలని సుప్రీంకోర్టులో రియా పిటీషన్ వేసింది.
రెండు పోలీసు బృందాలు ఒకే కేసును విచారిస్తుండటం సరికాదని పిటిషన్ లో పేర్కొంది.ఈ కేసు గురించి పోలీసులకి, ప్రజలకి పూర్తి వాస్తవాలు తెలుసని ఇంకా ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్ లు చట్ట విరుద్ధం అని అందులో పేర్కొన్నారు.
ఈ కారణంగా పాట్నా పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ బాద్యతలు ముంబై పోలీసులకి అప్పగించాలని పిటీషన్ లో కోరారు.