సమాంజంలోని హింసని, నాయకులని, వారి స్వభావాన్ని, వారి కథని .ఎప్పుడూ తెర మీద చూపెట్టాలని తహతహలాడే రామ్ గోపాల్ వర్మ, ఈసారి బెజవాడ రౌడియిజాన్ని, రాజకీయాల్ని ఒక ఊపు ఊపిన వంగవీటి రాధ, రంగ జీవితాల్ని ఎంచుకోని “వంగవీటి” అనే పేరుతో సినిమాని తీసారు.
మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.
కథలోకి వెళ్తే :
బస్టాండ్ రాధాగా పేరు తెచ్చుకోని, చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకునే వంగవీటి రాధ వెంకటరత్నం నాయకత్వంలో పెద్ద రౌడిగా ఎదిగి, ఆ తరువాత తననే చంపి, బెజవాడ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు.పేరుతో పాటు శతృవులని సంపాదించుకున్న రాధ, ఆ తరువాత ఓ రాజకీయ పార్టీ ఉచ్చులో పడి హత్యచేయబడతాడు.దాంతో అప్పటిదాకా వంగవీటి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిన స్టూడెంట్ లీడర్లు గాంధీ, నెహ్రూ, రాధ తమ్ముడు రంగని తమ నాయకుడిగా ఎన్నుకుంటారు.
కాని రంగ రాధ స్థానంలోకి వచ్చాక, గాంధీ – నెహ్రులతో సంబంధాలు బలహీనమవుతాయి.వీరు శత్రువులగా మారడంతో, బెజవాడ రాజకీయాల్లో వచ్చిన మార్పులేంటో, అందులో గాంధీ – నెహ్రుల తమ్ముడు మురళి పోషించన పాత్ర ఏంటో, వంగవీటి పతనం .అంతా తెర మీదే చూడండి.
నటీనటుల నటన :
వంగవీటి బ్రదర్స్ పాత్రలు రెండిటిని సందీప్ పోషించాడు.అయితే రెండు పాత్రలకి మధ్య వ్యత్యాసం వస్త్రధారణలో చూపెట్టడమే తప్ప, నటనలో కనబడలేదు.రత్నకుమారి పాత్రలో నైనా గంగూలి అందంగా కనబడటమే తప్ప, లింప్ సింక్ లేక, ఓ పాత్రలా మెప్పించలేకపోయింది.
నెహ్రూ పాత్ర పోషించిన నటుడు, మురళి పాత్ర పోషించిన వంశీ మంచి నటనను కనబర్చి మెప్పించారు.మిగితా పాత్రధారులు డబ్బింగ్ ఆర్టిస్టుల్లా ఉన్నారు.
* సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాటోగ్రాఫి కొన్ని సన్నివేశాల్లో రామ్ గోపాల్ వర్మ పైత్యానికి నిదర్శనంగా కనిపించినా, చాలావరకు కళ్ళను కట్టిపడేస్తుంది.కొన్ని షాట్స్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తప్ప, ఇంకెక్కడ చూడలేం.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.థీమ్ సాంగ్ కూడా మెప్పిస్తుంది.
నైనా ఇంట్రోడక్షన్ ని తప్పిస్తే, సంగీత దర్శకుడు రవి శంకర్ మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.
ముఖ్యాంగా సెకండాఫ్ లో.నిర్మాణ విలువలు వర్మ గత కొన్ని చిత్రాలతో పోలిస్తే గొప్పగా ఉన్నట్లే లెక్క.కాని ఇంకా నాసిరకంగానె ఉన్నాయి.
* విశ్లేషణ :
మీరు రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ అయితేనే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.పూర్తి సినిమాని కాకపోయినా, కొన్ని సన్నివేశాల్ని.కాని సినిమాని సినిమాగా చూడాలి కాబట్టి, ఈ సినిమా చూసి, మొత్తం బెజవాడ రౌడియిజం గురించి సమాచారం తెలుసుకుందాం అనే ప్రేక్షకులు నిరుత్సాహపడాల్సిందే.
ఎందుకంటే వర్మ రాజకీయాల్ని, ఆ పాత్రల స్వాభావం కన్నా, హింస మీదే దృష్టి ఎక్కువగా పెట్టారు.ఉన్న కథను తెర మీద ఆసక్తకరంగా మలచలేకపోయారు.
కాని, కొన్ని సన్నివేశాల్లో మాత్రం వర్మ మార్క్ కనబడుతుంది.పాత్రలు ఒకరిని ఒకరు చంపుకునే విధానం రియాలిస్టిక్ గానే అనిపించింది.
ఆ సన్నివేశాల కోసమైనా ఓసారి సినిమా చూడాలేమో.
ఒవరాల్ గా చెబితే, ఐస్ క్రీమ్ కన్న పెద్ద నిర్మాణ విలువలతో (అవి కూడా మెప్పించవు), లిప్ సింక్ లేని పాత్రలతో, డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లు అనిపించే ఓ హింసాత్మక ప్రయత్నం వంగవీటి.
అందర్ని మెప్పించకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
* వర్మ మార్క్ సన్నివేశాలు కొన్ని
* రియాలిస్టిక్ అనిపించే వైలెంట్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
* డబ్బింగ్
* సంభాషణలు
* దెబ్బతిన్న సెకండాఫ్
చివరగా :
చరిత్ర కోసం బెజవాడ ప్రజల్ని అడగండి, పేపర్లు చదవండి.
తెలుగుస్టాప్ రేటింగ్ :2.5/5
.