దిశ ఘటనపై ఆర్జీవీ సినిమా... అంత సామాజిక బాద్యత ఉందా

ఆర్జీవీ సినిమాలు ఎప్పుడు ఎవరో ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి తప్ప సొసైటీలో మార్పు కోసం, సామాజిక అంశాల ప్రధానంగా అస్సలు ఉండవు.

అతను తీసిన మొదటి సినిమా శివ నుంచి చూసుకున్న అయితే క్రైమ్, అయితే హర్రర్, అయితే కాంట్రవర్సీ సబ్జెక్టులనే ఎక్కువగా ఎంచుకొని సినిమాలు తీశారు.

ఇక సమాజంతో కాని, అందులో ఉండే మనుషులతో కాని తనకి ఎలాంటి సంబంధం లేదనే విధంగా, తనకు ఏది తీయాలనిపిస్తే అలాంటి సినిమా తీస్తా అంటూ నిర్మొహమాటంగా వర్మ చెప్పేస్తూ ఉంటారు.కొద్ది రోజుల క్రితం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ ఓ సినిమా తీసి జనం మీద వదిలాడు.

ఆ సినిమా మీద గొడవ జరిగినన్ని రోజులు కూడా థియేటర్ లో ఆడలేదు.ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాస్తా సైలెంట్ గా ఉన్న వర్మ అప్పుడప్పుడు సినిమాల మీద కామెంట్స్ పెడుతూ కాలక్షేపం చేస్తున్నాడు.

అయితే తాజాగా త్వరలో మరో సినిమా మొదలుపెట్టబోతున్నట్లు వర్మ ట్విట్టర్ వేదికంగా ప్రకటించాడు.హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుందని, ఇందులో దిశ అత్యాచారం తరువాత నిందితుల ఎన్ కౌంటర్ అంశాలని ప్రధానంగా చేసుకొని సినిమా తీయబోతున్నట్లు తెలిపాడు.

Advertisement

అయితే ఇప్పటికే ఈ ఘటన మీద వర్మ పోజిటివ్ గా స్పందించిన నేపధ్యంలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా పోలీసులని హీరోలుగా చూపిస్తూ సినిమా తీసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే వర్మ సినిమా తీసేంత వరకు అది వస్తుందో రాదో కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో నిజంగానే దిశ ఘటనపై వర్మ చేసిన ట్వీట్ ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు