తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీ స్థానం కోసం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ నుండి భారీగా పోటీ ఎదురవుతోంది.
బీజేపీ కంటే క్షేత్ర స్థాయిలో పటిష్టమైన కార్యకర్తల నిర్మాణం కలిగి ఉన్నా బీజేపీకి పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్న పరిస్థితి నేడు రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాడే విషయంలో కాక అంతర్గత విభేదాల తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.
తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట అనేది ప్రజల్లో దిగజారుతూ వస్తున్న పరిస్థితి ఉంది.
ఇటీవల కాంగ్రెస్ లో ఐక్య రాగం వినిపించి కొన్ని నెలలు కూడా కాకముందే మరల కలహాలు మొదలయ్యాయి.
మెదక్ జిల్లా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్న పరిస్థితుల్లో రేవంత్ జోక్యాన్ని ఖండిస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.అయితే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బహిరంగంగా మీడియా సమావేశంలోనే ఖండించడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది.
దీంతో జగ్గారెడ్డిపై చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడవద్దని జగ్గారెడ్డికి సూచించారు.

అయితే చిన్నారెడ్డికి కౌంటర్ గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్పడింది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా అంటూ వ్యాఖ్యానించారు.దీంతో ఈ వివాదం కాంగ్రెస్ అంతర్గతంగానే నేతల మధ్య తీవ్ర విభేదాలను సృష్టించే అవకాశం కనిపిస్తోంది.రోజు రోజుకు ఈ వివాదం ముదురుతున్న పరిస్థితిలలో హైకమాండ్ జోక్యం లేకుంటే ఈ రేవంత్- జగ్గారెడ్డి వివాదం పరిష్కారం అయ్యేటట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందనేది చూడాల్సి ఉంది.