తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు పెద్ద ఎత్తున బలపడడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీపై ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున బలపరచాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే మొన్నటి వరకు కలహాల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ నేడు ఐక్య రాగం వినిపిస్తున్న తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావలనే లక్ష్యంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలనే వ్యూహంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలతో ప్రజల్లో ఉండేలా కార్యాచరణ, కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి.ఎందుకంటే ప్రజల సమస్యలపై పోరాటం చేయక పోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగై పోయింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని నిరూపించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.ఎందుకంటే ప్రస్తుతం అంతా సోషల్ మీడియా కాలం నడుస్తోంది.
బీజేపీతో పోలిస్తే సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న మాట వాస్తవం.ఇటు సోషల్ మీడియాలోనూ బయట కూడా బీజేపీ కెసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అనే విషయాన్ని బలంగా తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న తరుణంలో బీజేపీని వెనక్కి నెట్టి ప్రజల్లో ముందుకు సాగాలంటే చాలా రకాలుగా ప్రజలను మెప్పిస్తే కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనక్కి నెట్టే అవకాశం లేదు.
మరి రేవంత్ దూకుడు కాంగ్రెస్ కు ఎంత మేర లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.