డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు రేవంత్ ప్లాన్‌..

ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ అంటే రాజ‌కీయాల్లో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఉమ్మడి రాష్ట్రంలో ఆయ‌న చ‌క్రం తిప్పారు.

కాంగ్రెస్ ను అప్పుడు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త కేవ‌లం వైఎస్ఆర్ కు అలాగే డీఎస్ ద్వయానికి మాత్ర‌మే ద‌క్కుతుందంటే అతిశ‌యోక్తి కాదు.వీరి హ‌యాంలోనే చాలామంది రాజ‌కీయంగా ఎదిగారు.

ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ఎంతోమంది పెద్ద లీడ‌ర్లుగా ఉన్నారంటే వారికి అప్ప‌ట్లో అవ‌కాశం ఇచ్చింది కూడా డీఎస్ మాత్ర‌మే.సమకాలీన రాజకీయాల్లో డీఎస్ ది అంద‌వేసిన చేయి.

సుదీర్ఘ అనుభ‌వం ఉన్న నేత‌.అలాంటి వ్య‌క్తి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన త‌ర్వాత రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయారు.

Advertisement

ఆయ‌న‌కు కేసీఆర్ రాజ్యసభ స‌భ్యుడిగా ప‌ద‌వి ఇచ్చి అప్ప‌టి నుంచి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు.ఇక క‌విత ఫిర్యాదుల‌తో అప్ప‌ట్లో ఆయ‌న వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున ర‌చ్చ‌గా మారిపోయింది.

దాంతో కేసీఆర్ కూడా ఆయ‌న్ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు.ఆయ‌న చిన్న కొడుకు ధ‌ర్మ‌పురి అర‌వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇక పెద్ద కొడుకు సంజ‌య్ కూడా మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ లోనే ఉన్నా ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు.

కాగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత అయిన డీఎస్‌ను ఇప్పుడు కాంగ్రెస్ లోఎ ఏప‌క‌ప పాత కాపులనంతా ఆయ‌న్ను ర‌మ్మ‌ని కోరుతున్నారంట‌.రీసెంట్ గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయ‌న్ను క‌లిసి డీఎస్ తో రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు.ఆయ‌న్ను కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఎలాగూ పెద్ద కొడుకు కాంగ్రెస్‌లోనే ఉండ‌టంతో ఆయ‌న ద్వారా డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి ర‌ప్పించేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇదే జ‌రిగితే ఎంపీ అర‌వింద్‌కు పెద్ద షాక్ త‌గులుతుంది.

Advertisement

చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

తాజా వార్తలు