55 నెలల్లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు..: సీఎం జగన్

అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించారు.ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు.

 Revolutionary Changes In The Education Sector In 55 Months..: Cm Jagan-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 55 నెలల్లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు.రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పారు.ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు చదువు సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు.

ట్యాబ్ లలో ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయంలో ఇవ్వాలన్నారు.వారం రోజుల్లో రిపేర్ చేసిస్తారన్న ఆయన లేదంటే కొత్తది ఇస్తామని పేర్కొన్నారు.ట్యాబ్ ల పంపిణీతో ప్రతి విద్యార్థికీ రూ.33 వేల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.నాడు – నేడులో భాగంగా స్కూల్స్ రూపురేఖలు మార్చామన్నారు.ఇందులో భాగంగా ప్రతీ క్లాసురూంను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దామని వెల్లడించారు.నాడు -నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయన్న సీఎం జగన్ త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube