ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారన్నది చెప్పడం కష్టం.ఓవర్ నైట్ తో స్టార్ గా అయిన హీరోలు ఉంటారు.
అయితే దాని వెనక ఏళ్ల తరబడి కష్టం ఉంటుందనుకోండి.ఇదిలాఉంటే సినిమా హీరోలే కాదు ఈమధ్య ఆ సినిమాలకు రివ్యూస్ చెప్పే వారు కూడా పాపులర్ అవుతున్నారు.
లేటెస్ట్ గా అలాంటి వారిలో అందరికి సుపరిచుతుడు అయ్యాడు లక్ష్మణ్ బ్రో.బ్రో అంటూ అతను చెప్పే ప్రతి సినిమా రివ్యూ ఆడియెన్స్ ని అలరిస్తుంది.సెపరేట్ గా అతనికి ఎలాంటి యూట్యూబ్ ఛానెల్ లేదు.
సినిమా చూసి బయటకు వచ్చిన అతను మీడియా వారు అడిగిన రివ్యూ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు.
అయితే సినిమాలోని ఎమోషన్ ని రివ్యూతో క్యారీ చేస్తూ రివ్యూ లక్ష్మణ్ పేరు తెచ్చుకున్నాడు.అతను ఎంత పాపులర్ అయ్యాడు అంటే అతనితో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ చేసేంత పాపులర్ అయ్యాడు.
అలా రివ్యూ లక్ష్మణ్ కూడా ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయ్యాడని చెప్పొచ్చు.అయితే ఇప్పుడు అతను రెండు మూడు వారాల నుంచి జబర్దస్త్ లో కూడా కనిపిస్తున్నాడు.

జబర్దస్త్ లో కొందరు కమెడియన్స్ బయటకు వెళ్లగా ఉన్న వాళ్లతో కొత్త టీం లు ఏర్పరిచారు.ఈ క్రమంలో జబర్దస్త్ లో అజార్ టీం ఒకటి కొత్తగా ఏర్పడింది.అందులో రివ్యూ లక్ష్మణ్ ని తీసుకొచ్చాడు అజార్.స్కిట్ లో అతనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.ఒక ఎపిసోడ్ లో వస్తే గెస్ట్ అని అనుకున్నారు కానీ అజార్ టీం లో రివ్యూ లక్ష్మణ్ కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది.ఓ విధంగా థియేటర్ బయట రివ్యూస్ చెబుతూ ఫేమస్ అయిన రివ్యూ లక్ష్మణ్ ఇలా జబర్దస్త్ లో ఛాన్స్ దక్కించుకోవడం కూడా లక్కీ అని చెప్పొచ్చు.
ఈ వేదికని సరిగా వాడుకుంటే రివ్యూ లక్ష్మణ్ కూడా మంచి కమెడియన్ అయ్యే ఛాన్స్ ఉంది.







