తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే విధంగా ఈ మధ్యకాలంలో హడావుడి పెరిగింది.బీఆర్ఎస్ బిజెపిలోని కీలక నేతలు చాలామంది కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు.
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ కు( Telangana Congress ) మరింత బలాన్ని చేకూర్చాయి.ఇక బీ ఆర్ ఎస్ బిజెపి లకు దీటుగా గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయింపులపై ఇప్పుడు కసరత్తు జరుగుతుంది.
తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నేతల ఆలోచనకు అనుగుణంగానే సునీల్ కానుగొలు( Sunil Kanugolu ) వ్యూహాలు రచిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపై సర్వేలు ఎప్పటికప్పుడు చేస్తున్న రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఎప్పటికప్పుడు ఆ నివేదికలను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపిస్తున్నారు.
దీంతో కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారు పార్టీలో ఉన్న ఇతర పార్టీలలో ఉన్న వారిని ఒప్పించి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సందర్భంగా వారి డిమాండ్లను నెరవేరుస్తామనే హామీ ఇస్తూ టికెట్ ఇవ్వబోతున్నట్లు వారికి హామీ ఇస్తూ.
కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు.గెలుపునకు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టడం లేదు.
బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumantha Rao ) ఇటీవల బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.

ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ మేరకు ఆయనను ఒప్పించే విషయంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సక్సెస్ అయ్యారు.మల్కాజ్ గిరి తో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో మైనంపల్లికి మంచిపట్టు ఉంది ఆయన ఏ పార్టీలో చేరినా గెలుస్తారనే ధీమాతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేలా ఒప్పించారు.
ఇదేవిధంగా భువనగిరి నుంచి కాంగ్రెస్ నేతగా ఉన్న కంభం అనిల్ రెడ్డి కొంతకాలం బీఆర్ఎస్ లో చేరారు.అయితే ఆయనకు టిక్కెట్ ఇస్తామని ముందుగా చెప్పిన బీఆర్ఎస్ ఆయనకు మరో పదవిని కట్టబెట్టి టికెట్ నిరాకరించింది.

భువనగిరిలో కంభం అనిల్ రెడ్డి( Kambham Anil Reddy ) గెలుస్తారని సునీల్ కానుగోలు సర్వేలో తేలడంతో రేవంత్ రెడ్డి స్వయంగా అనిల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.టికెట్ ప్రకటించడంతో పాటు కేసి వేణుగోపాల్ తో కూడా మాట్లాడించడంతో కంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో కీలక నేతలకు టికెట్ల హామీ ఇస్తూ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.







