తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి </em( Revanth Reddy )దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.ఉద్యమకారులకు, కీలక నేతలకు అనేక పదవులను ఇప్పటికే కేటాయించారు.
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే 11 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి, వారికి శాఖలు కేటాయించారు.పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించుకున్న రేవంత్ మరికొంతమంది కీలక నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు.అక్కడ కాంగ్రెస్( Congress ) అగర నేతలతో సమావేశమై తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పైన రేవంత్ చర్చించబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి .
ఈ మేరకు కొంతమంది పేర్ల జాబితాను రేవంత్ వెంట తీసుకువెళ్లారట .మంత్రివర్గ విస్తరణతో పాటు, నామినేటెడ్ పదవుల భర్తీపైన హై కమాండ్ తో చర్చించనున్నట్లు సమాచారం .అలాగే మరికొద్ది నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు జరగబోతూ ఉండడంతో ముందుగానే పదవుల భర్తీ చేపట్టి, పార్టీలో జోష్ తీసుకురావాలని , అలాగే లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్థుల విషయంలోనూ ఒక క్లారిటీకి రావాలని రేవంత్ నిర్ణయించుకుని, ఈ విషయాలపై అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి పయనం అవుతున్నట్లు సమాచారం.కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాతో పాటు, లోక్ సభ కు పోటీ చేసేందుకు ఆసక్తి తో ఉన్న బలమైన నేతల పేర్ల జాబితాను రేవంత్ అధిష్టానం పెద్దలకు ఇవ్వనున్నారట.
![Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Telangana-government-Telangana-cabinet-PCC-chief-Sonia-Rahul-Gandhi.jpg)
ఇక తెలంగాణా క్యాబినెట్ ( Telangana Cabinet ) లో చోటు కోసం చాలామంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు.ఇందులో ఓటమి చెందిన వారు ఉన్నారు.వారిలో రేవంత్ కు అత్యంత సన్నిహితమైన వారు ఉండడంతో, వారిని మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై హై కమాండ్ పెద్దలను రేవంత్ ఒప్పించాలని నిర్ణయించుకున్నారట .ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు గెలవలేదు. అయినా నాంపల్లిలో ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ మైనారిటీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు .అలాగే నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ ఆలీ సైతం మంత్రి పదవిపై ఆశ తో ఉన్నారు.ఒకవేళ ఫిరోజ్ ఖాన్ కు అవకాశం దక్కితే షబ్బీర్ అలీ కి ఛాన్స్ దక్కకపోవచ్చు.
ఇక మల్కాజ్ గిరి నుంచి ఓటమి చెందిన మైనంపల్లి హనుమంతరావు సైతం మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు.అయితే ఆయనను మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ కు పోటీ చేయించాలని రేవంత్ భావిస్తున్నారట.
అంజనీ కుమార్ యాదవ్, ముషీరాబాద్, మధు యాష్కీ ఎల్బీనగర్ స్థానాల్లో ఓటమి చెందినా, వారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవులు ఇస్తారని వారి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు.
![Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/BJP-revanth-Reddy-Telangana-elections-Telangana-government-Telangana-cabinet.jpg)
ఇక అదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ , వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవి విషయంలో పోటీ ఉంది .ఇద్దరు నేతలు ఢిల్లీ పెద్దల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు .వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లు కూడా ప్రయత్నాలుచేస్తున్నారుఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.
దీంతోపాటు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే విషయంపైనా అధిష్టానం పెద్దలతో రేవంత్( Revanth Reddy )చర్చించనున్నారట.