గత ప్రభుత్వ హయాంలో అసలు కేసీఆర్ కు ఎదురుందా అనే ప్రశ్నలు తలెత్తాయి.తెలంగాణ లో అసలు ప్రతిపక్షాలు ఉన్నాయా అనే డౌటు కూడా కలిగింది.
అంతలా ప్రతిపక్షాలను తన వ్యూహాలతో దారుణంగా దెబ్బతీశారు సీఎం కేసీఆర్.అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది.ఇప్పుడు కొత్త వ్యూహాలతో కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు.ఇప్పటికే బండి సంజయ్ రూపంలో ప్రతిపక్షంగా బలపడుతోంది బీజేపీ.ఇదిలా ఉండగానే రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ అప్పగించినప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఇక ఇప్పుడు మరో పోరాటానికి తెరలేపుతున్నారు.
చాలా రోజుల తర్వాత తమ మిత్ర పక్షాలైన ఇతర పార్టీలతో రేవంత్‌రెడ్డి జత కట్టారు.రీసెంట్‌గానే వారితో గాంధీ భవన్‌లో మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి భవిష్యత్‌లో అందరం కలిసి ఉద్యమాలు చేస్తామంటూ పిలుపునిచ్చారు.
ఇక ఇప్పుడు అనుకున్నట్టుగానే బీజేపీ మినహా మిగతా అన్నిపార్టీలు, అలాగే ప్రజా సంఘాలు కలిసి ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా చేయడం పెద్ద సంచలనంగా మారింది.ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సీపీఎం, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ సహా తెలంగాణ ఇంటి పార్టీలు ఇందులో పాల్గొన్నాయి.

దీంతో రేవంత్ బలం మరింత పెరిగిందని నిపుణులు అంటున్నారు.ఒక్కడై అడిగేకంటే కూడా అన్ని పార్టీలు కలిసి ఒకే తాటిమీదకు వచ్చి ఇలా నినదిస్తే ప్రభుత్వం కచ్చితంగా దిగి వస్తుందని చెబుతున్నారు.ఇక అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును నిలదీసేలా వీరి ధర్నాలు ఉండటంతో ఒకే సమయంలో అటు టీఆర్ ఎస్‌కు, ఇటు బీజేపీకి చెక్ పెడుతున్నట్టు చెబుతున్నారు.ఇది టీఆర్ ఎస్ కు పెద్ద సవాలుగా మారింది.
తెలంగాణలో రాజకీయ ఉద్యమం మొదలైందని ఈ పార్టీలు అన్నీ చెప్పడంతో కాంగ్రెస్లో మంచి జోష్ కనిపిస్తోంది.