తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది.ఈ క్రమంలో ఢిల్లీలోని నివాసం నుంచి ఆయన ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
ఈ నేపథ్యంలో మరికాసేపటిలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.కాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.