బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈటల ఆరోపణలపై సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మీ ఆలయానికి వస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తడి బట్టలతో ప్రమాణం చేస్తానన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఈటల కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.అయితే రేవంత్ సవాల్ పై స్పందించకూడదని ఈటల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ఆయన నివాసం నుంచి ఆలయానికి బయలుదేరారు.బీజేపీ, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.