తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న ఎల్బీ స్టేడియానికి మరికాసేపటిలో రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 12.45 గంటలకు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.55 గంటలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై చేరుకోనున్నారు.కాగా మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం జరగనుండగా మధ్యాహ్నం 1.25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది.ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత చివరగా గవర్నర్, సీఎంతో మంత్రిమండలి గ్రూప్ ఫోటో ఉండనుంది.
మరోవైపు నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు.







