ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ( Telangana congress )అనూహ్యంగా బలపడింది.గతంలో ఏ మాత్రం అంచనాలు లేని హస్తం పార్టీ ఇప్పుడు ఎన్నికల రేస్ లో బిఆర్‌ఎస్ కు గట్టి పోటీ ఇస్తోంది.
ఈసారి కాంగ్రెస్ గెలుపు తథ్యం అని ఆ పార్టీ నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మరి ఈ స్థాయిలో హస్తం పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి ప్రధాన కారణం ఆ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అనేది చాలమంది రాజకీయ వాదుల అభిప్రాయం.
మొదట రేవంత్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనప్పటికి ప్రస్తుతం ఆయన నాయకత్వం కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందనే భావన హైకమాండ్ లో ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాద్యతలను కూడా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికలు( Telangana elections ) ముగియనున్నాయి.ఇక్కడ ఫలితాల సంగతి ఎలా ఉన్నా వచ్చే ఏడాది ఏపీలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే సౌత్ రాష్ట్రాలలో పట్టు సాధించడం చాలా అవసరం.అందులో భాగంగానే ఇప్పటికే కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం కోసం ఆరాటపడుతోంది.

ఆ తరువాత ఏపీలో కూడా ఇదే రేంజ్ లో పార్టీ పునర్జీవం పోసుకుంటే తిరుగుండదనే భావన హైకమాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పాతాళానికి పడిపోయింది.అందువల్ల పార్టీని వేగంగా పైకి తీసుకురావాలంటే సరైన నాయకత్వం చాలా అవసరం అందుకే ఏపీలో కూడా కాంగ్రెస్ బాద్యతలు రేవంత్ రెడ్డి కే అప్పగించేందుకు అధిష్టానం సిద్దమతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పడంతో ఏపీలో కాంగ్రెస్ లో కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి నిలువనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
మరి ఏపీ రాజకీయాల పట్ల కాంగ్రెస్ వ్యూహ రచన ఎలా ఉండబోతుందో చూడాలి.