తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఈసారి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అడవి బాట పట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ( Congress party ) ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది యువత అడవిలో అన్నలు కావడానికి కాదు.వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు ఉద్యోగులై, సైంటిస్టులై, ఐపీఎస్ లై, ఐఏఎస్ లై, ఐఆర్ఎస్ లై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చింది అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో యువకులు గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాక పెండ్లి చేసుకోక ఇంటిలో తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక.దిల్ షుక్ నగర్, కుక్కట్ పల్లి, అశోక్ నగర్, అమీర్ పేట్ వంటి చోట్ల.
ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు.తెలంగాణలో ఉన్న ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు అడవి బాట పట్టారంటే.
తెలంగాణలో నాయకులు ఒక్కరు కూడా మిగలరు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఒక్క యువత మాత్రమే కాదు కేసీఆర్( CM KCR ) హయాంలో రైతులు( Farmers ) కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.కాబట్టి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక ఏడాదికే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.