మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.నిండు మనసుతో మునుగోడు ఓటర్లు ఆడబిడ్డను ఆశీర్వదించాలని తెలిపారు.
మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.
‘ఆత్మ గౌరవ సభకు పాల్వాయి గోవర్దర్ రెడ్డి భార్య స్రవంతి అమ్మ గారు వచ్చారు.గోవర్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత స్రవంతి బయటికి రావడం మరిచారు.
అందుకే స్రవంతిని మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టాం.అందుకే ఇప్పుడు మీ ఆడబిడ్డ స్రవంతిని చంపుకుంటారో.
ఆదుకుంటారో మీ ఇష్టం.’ అని ఎమోషనల్‌గా మాట్లాడారు.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు.
ఆ నలుగురిలో స్రవంతిని కూడా మంత్రి పదవి కేటాయిస్తామన్నారు.అలాగే మునుగోడులో స్రవంతిని గెలిపిస్తే.
నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామన్నారు.అలాగే మునుగోడు అభివృద్ధికి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటానన్నారు.

మునుగోడుకు ప్రత్యేక చరిత్ర ఉంది.ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని, అలాంటి గడ్డపై ఇప్పుడు ఎన్నికలు వచ్చిందన్నారు.ప్రజల చేతిలోనే భవిష్యత్ ఉందన్నారు.తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరికీ రాని అవకాశం మునుగోడుకు వచ్చింది.సీఎం కేసీఆర్ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు.ఢిల్లీ, గుజరాత్ నుంచి తీసుకొచ్చిన మందు, నోట్ల కట్టలతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.
దీనికి ఓటర్లు తమదైన శైలిలో గుణపాఠం చెప్పాలన్నారు.రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ చేసిందన్నారు.
పార్టీకి మోసం చేసి బీజేపీ చేరాడన్నారు.కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరాడని, అలాంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడూ క్షమించదన్నారు.