తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రేవంత్ రెడ్డితో వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.తెలంగాణలో జరిగిన ఉద్యమాలపై పూర్తి అవగాహన ఉన్న నేత రేవంత్ రెడ్డి అని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలే నినాదాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో ఆ ఆశయాలను రేవంత్ సర్కార్ సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని సార్థకతను కల్పించాలన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.







