తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనుంది.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయింది.
సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనల్ చేసిందని తెలుస్తోంది.ఇక డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.
ఈ మేరకు ఈనెల 7వ తేదీన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.కాగా సీఎం సహా 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు కానుంది.
మరోవైపు లోక్ సభ ఎన్నికల వరకు తెలంగాణలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డినే కొనసాగనున్నారు.