తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీకాంగ్రెస్ మంచి జోరు మీద ఉంది.మూడోసారి కచ్చితంగా విజయం సాధించాలని ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలవడంతో తెలంగాణ ఎన్నికల ప్రచారాలలో కూడా జాతీయ కాంగ్రెస్ నేతలు హుషారుగా పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివరకు వంద నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండు విడతల వారీగా 100 మంది అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయడం జరిగింది.తొలి జాబితాలో 55 మంది.
రెండో జాబితాలో 45 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది.
అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది.16 మంది అభ్యర్థులతో మూడో జాబితాని విడుదల చేయడం జరిగింది.కామారెడ్డి నుండి రేవంత్ రెడ్డి, చెన్నూరు నుండి వివేక్, బోద్ నుండి గజేందర్, జుక్కల్ నుండి కాంతారావు, బాన్సువాడ నుండి రవీందర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుండి షబ్బీర్, కరీంనగర్ నుండి కే శ్రీనివాస్, సిరిసిల్ల నుండి మహేందర్ రెడ్డి, నారాయణ ఖేడ్ నుండి సురేష్, పటాన్ చెరువు నుండి నీలం, మధు, వనపర్తి నుండి మెఘా రెడ్డి, డోర్నకల్ నుండి రామచంద్రు, వైరా నుండి రాందాస్, సత్తుపల్లి నుండి రాగమయి, అశ్వారావుపేట నుండి ఆదినారాయణ, ఇల్లందు నుండి కనకయ్య పోటీకి దిగుతున్నారు.
దీంతో ఈ లిస్టు ప్రకారం చూస్తే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉండగా, సీఎం కేసీఆర్ పైనే పోటీకి దిగటానికి రెడీ కావడం జరిగింది.