బీజేపీ నేత నరేంద్ర రాథోడ్ పై( Narendra Rathod ) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను( Mallikarjuna Kharge ) కుటుంబంతో సహా హత్య చేస్తానని కర్ణాటక బీజేపీ నేత మణికంఠ ఆడియోలు బయటికి వచ్చాయని రేవంత్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.ఇదే సమయంలో మోడీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్ డిమాండ్ చేయడం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో మే 10వ తారీకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాన పార్టీలు భారీ ఎత్తున ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.ఎలాగైనా కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.ఈ క్రమంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాని మోడీ భారీ ఎత్తున రోడ్డు షోలలో… బహిరంగ సభలలో పాల్గొంటూ ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. సో ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.దీంతో ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ నేత మణికంఠ నరేంద్ర రాథోడ్… కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంబాన్ని హతమరుస్తానని వ్యాఖ్యలు చేయడాని రేవంత్ రెడ్డి తప్పుపడుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.