Antony Victor Ear: చెవిలో వెంట్రుకలు పెంచి గిన్నిస్ రికార్డు సాధించిన రిటైర్డ్ మాస్టారు

కొంత మందికి కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి.మగ వాళ్లైనా సరే ఆడవారిలా జుట్టు భారీగా పెంచుతారు.

 Retired Master Who Holds Guinness Record For Growing Ear Hair , Ear, Hair, Anton-TeluguStop.com

మహిళల మాదిరిగానే జడలు వేసుకుంటున్నారు.వెరైటీగా కనిపించేందుకు, ఏదో ఒక ప్రత్యేకత తమలో ఉందనే విషయం చాటుకునేందుకు ఈ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తున్నారు.

అయితే ఓ వ్యక్తి విచిత్రంగా తన చెవిలో వెంట్రుకలు భారీగా పెంచాడు.ఈ విషయంలో ఆయన ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

పొడవైన చెవి వెంట్రుకలతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Antony Victo, Madurai, Tamil Nadu, Latest-Latest News - Telugu

భారతదేశానికి చెందిన రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెవిలో పొడవాటి వెంట్రుకలను కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించగలిగారు.ఆ వ్యక్తి ఆంటోనీ విక్టర్.రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.అతడిది తమిళనాడులోని మధురై ప్రాంతం.

అతని చెవి వెంట్రుకలు బాగా పొడవుగా ఉంటాయి.ఇటీవల వాటిని కొలవగా ఏకంగా 18.1 సెంటీమీటర్లు, అంటే 7.12 అంగుళాలు ఉన్నాయి.అతను 2007 నుండి తన చెవిలో పొడవైన వెంట్రుకలను పెంచుతూ వస్తున్నాయి.గత 15 సంవత్సరాలలో అతని రికార్డును ఎవరూ అధిగమించలేక పోయారు.ఆంటోనీ విక్టర్ సాధించిన విజయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఇక చెవిలో వెంట్రుకలు పెంచే ఆంటోనీని చాలా మంది పరిహాసం ఆడేవారు.

చివరికి విద్యార్థులు కూడా “చెవిలో బొచ్చు టీచర్” అని పిలిచేవారు.ఇక ఆయనకు గిన్నిస్ రికార్డు వచ్చిందని తెలియగానే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇలాంటి వాటికి ప్రపంచ రికార్డు వచ్చిందని తెలియగానే తాము అవాక్కయ్యామని అంటున్నారు.ఇక నుంచి తాము కూడా ఇదే తరహాలో చెవిలో వెంట్రుకలు పెంచుతామని, గిన్నిస్ రికార్డే తమ లక్ష్యమని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube