శ్రీహాన్, చిన్మయి వివాదంపై స్పందించిన సిరి... వీడియో పై క్లారిటీ ఇచ్చేసిందిగా?

బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సిరి శ్రీహాన్ గురించి అందరికీ సుపరిచితమే.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా వీరిద్దరూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Responding To Srihan And Chinmayis Controversy Siri Gave Clarity On The Video ,-TeluguStop.com

అయితే వీరిద్దరూ పెళ్లి కాకుండానే ఒక బాబుని దత్తత తీసుకొని పెంచుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఇక శ్రీహన్ తన కొడుకు రిమోట్ ఇరగొట్టాడని తనని కంట్రోల్ చేయడం కోసం బెల్ట్ తీసుకుని తనని తాను కొట్టుకుంటూ తన కుమారుడిని బ్లాక్ మెయిల్ చేసినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది.

ఈ వీడియో పై సింగర్ చిన్మయి స్పందిస్తూ పేరెంట్స్ అలా తమని తాము బాధ పెట్టుకుంటూ పిల్లలను బ్లాక్ మెయిల్ చేయడం తప్పని ఇండియాలో ఇప్పటికి చాలామంది పేరెంట్స్ తమ పిల్లల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని ఇప్పుడు మనం వారిని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్లు కూడా మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారని చిన్మయి ఈ వీడియో పై స్పందించడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ సిరి శ్రీహన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.

ఇలా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో చివరికి ఈ వీడియో పై సిరీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ వీడియో గురించి సిరి మాట్లాడుతూ ఇది కేవలం తమ బుడ్డోడు ఆడిషన్ కోసం చేసిన ట్రయల్ షూట్ అని చెప్పుకొచ్చారు.ఇక శ్రీహాన్ సైతం ఈ వీడియో పై స్పందిస్తూ ఏంటి రాత్రికి రాత్రి ఇంత జరిగిందా? ఇది మా చైతు గాడి ఆడిషన్ వీడియో అండి బాబు ఇది కావాలని చేయలేదు అంటూ శ్రీహన్ చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా మమ్మల్ని ప్రేమించే మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలి కనుక ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నా అంటూ సిరి ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube