శిదిలావస్తకు చేరిన వాణిద్య సముదాయంపై స్పందించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు భీమిలి మెయిన్ రోడ్డులో ఉన్న వాణిద్య సముదాయం బీచ్ రోడ్డులో ఉన్న పైలాన్ శిదిలావస్తకు చేరి పెచ్చులు రాలిపోయి ప్రజలు బయాందోళనకు గురవుతున్నా జీవిఎంసీ అధికారులు ఎందుకు స్పందించలేక పోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ భీమిలి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు.జీవిఎంసీ కి ఆదాయం వచ్చే భీమిలి మెయిన్ రోడ్డులో ఉన్న వాణిద్య సముదాయం శిదిలావస్తకు చేరిందని అధికారులు నిర్ధారించడంతో ఉన్నఫలంగా దుకాణాలను ఖాళీ చేయించారని అన్నారు.
వాటి స్థానంలో నూతన సముదాయం నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఎందుకు ఆవిధంగా చర్యలు చేపట్టలేక పోతున్నారని అన్నారు.కొత్త భవనాలు కట్టడం తరువాత సంగతి, శిదిలావస్తకు చేరిన దుకాణాలు పెచ్చులు రాలిపోతున్నా పడగొట్టక పోవడంతో స్థానికులను భయాందోలనకు గురిచేస్తున్నాయని అన్నారు.
అదేవిధంగా బీచ్ రోడ్డులో భీమిలి చరిత్రను తెలియజేసే విధంగా 25 లక్షల రూపాయలతో నిర్మించిన పైలాన్ మరింత ప్రమాధకరంగా తయారయిందని గంటా నూకరాజు అన్నారు.పైలాన్ చుట్టుప్రక్కల వేసిన కాంక్రీటు దిమ్మలమీద పర్యాటకులు, స్థానికులు తీరిక సమయంలో సేదతీరుతారని అన్నారు.
ఇలాంటి సమయంలో కాంక్రీటు పెచ్చులు పడటంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.పైలాన్ పై భాగంలో మొక్కల రావడం వలన బీటలు వస్తున్నాయని, అందుకే వేరంగా శిదిలావస్తకు చేరిందని అన్నారు.
అదేవిదంగా వాణిద్య సముదాయం కొత్తగా నిర్మించి దుకాణాల ఏర్పాటుకు ఇచ్చినట్లయితే జీవిఎంసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు .పైలాన్ పెచ్చులు రాలిపోతున్నా, మెయిన్ రోడ్డులో ఉన్న దుకాణాలు ప్రమాద హెచ్చరికలు ఇస్తున్నా ఇంకా అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు.భీమిలి నియోజకవర్గానికి, భీమిలి జోన్ కి 3వ వార్డు కేంద్ర బిందువని, అధికార యంత్రాంగం అంతా ఈ వార్డులోనే ఉన్నా ఎందుకు ఈ వార్డుపై అంత నిర్లక్షంగా అధికారులు వ్యవహారిస్తున్నారని గంటా నూకరాజు ప్రశ్నించారు.రానున్న వర్షాకాలం కారణంగా ఇంకా ప్రమాధానికి గురయ్యే అవకాశం ఉందని, తక్షణమే అధికారులు ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడకముందే చర్యలు చేపట్టాలని గంటా నూకరాజు కోరారు.