నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.
కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియా గాంధీ అన్న ఆయన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని, కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.







