అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్( Tadipatri Municipal Chairman ) పదవికీ మరో ముప్ఫై రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.తాజాగా ఆయన అన్నట్లుగానే తన పదవికీ రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి( TDP Alliance ) అధికారంలోకి రావడంతో జేసీ తన నిర్ణయాన్ని ప్రకటించారు.ఈ క్రమంలోనే టీడీపీ కౌన్సిలర్లను ఛైర్మన్, వైస్ ఛైర్మన్ చేస్తానని జేసీ హామీ ఇచ్చారని సమాచారం.
ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తానన్న జేసీ తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిని తిరిగి తీసుకొస్తానని స్పష్టం చేశారు.