త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి..!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండలం మానాల గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, గ్రామానికి రెండు బోర్లు వేయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ జక్కు వంశీ శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas )కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జక్కు వంశీ మాట్లాడుతూ.

మానాల గ్రామంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయికి చేరిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రానున్న వేసవిలో ఇబ్బందులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, త్రాగునీటి కోసం రేందు బోర్లు కు యస్ డీఅఫ్ లేదా కలెక్టర్ నుంచి నిధులు కేటాయించి బోర్లా ను వేయించి త్రాగు నీటి కష్టాలను తీర్చాలని మానాల గ్రామ ప్రజల తరుపున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని,త్వరలోనే బోర్లను వెయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దర్శనపు జెలందర్,దర్శనపు గంగాధర్, ఔరగొండ మల్లేశం, ఏనుగుల రాజశేఖర్,గుంటి కొమురయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News